News January 17, 2026

పిల్లల్ని కనేముందు కౌన్సిలింగ్ అవసరం

image

పెళ్లి తర్వాత పిల్లల ప్లానింగ్‌కు ముందు భార్యాభర్తలు కౌన్సెలింగ్‌ తీసుకోవడం ద్వారా అనవసర భయాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు లాంటి సమస్యలుంటే ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. సహజంగా గర్భం దాల్చలేకపోతే దంపతులిద్దరూ వైద్యులను సంప్రదించాలి. అలాగే కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ, పేరెంటింగ్‌పై అవగాహన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 17, 2026

అసెంబ్లీలో మూగబోయిన మైకులు

image

AP: అసెంబ్లీ మైకుల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు సభల్లో గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. ఉదయం యథావిధిగా 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా, సభ్యుల స్థానాల్లోని మైకులు పనిచేయలేదు. స్పీకర్ గంటపాటు సభను వాయిదా వేశారు. తర్వాత సమస్యను టెక్నీషియన్లు పరిష్కరించగా ఉ.11:30 గంటల నుంచి సభ తిరిగి ప్రారంభమైంది. శాసన మండలి కూడా ఉ.11 గంటలకు ప్రారంభమైంది. సమస్య తలెత్తడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 17, 2026

మగువల ఆరోగ్యానికి మెంతిఆకు

image

మెంతి కూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలకు ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియా రాకుండా ఉంటుంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువ కాబట్టి వెయిట్‌లాస్‌కు దోహదపడతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బాలింతలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెనోపాజ్, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో విటమిన్ సి, ఎ లతోపాటు బీటా కెరొటిన్ సమృద్ధిగా ఉంటుంది.

News February 17, 2026

IOCL 121పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>IOCL<<>> హల్దియా రిఫైనరీ 121 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc(MPC, ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ), సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత గలవారు ఫిబ్రవరి 24 వరకు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com