News November 19, 2025
పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
Similar News
News February 13, 2026
కొడంగల్‌లో కాంగ్రెస్ విజయం

TG: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ (వికారాబాద్ జిల్లా)లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. BRS, MIM చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో BRS గెలిచింది.
News February 13, 2026
షాకింగ్.. ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన ఏఐ మోడల్

‘రోబో’ మూవీలో సొంతంగా ఆలోచించే చిట్టి(రోబో) సైంటిస్టునే చంపడానికి చూస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి నిజమయ్యే ప్రమాదం ఉంది. స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ వెల్లడించారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్ చేసిందని, చంపేందుకూ సిద్ధమైందని తెలిపారు. AIపై నియంత్రణ లేకపోతే ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఇదే నిదర్శనం.
News February 13, 2026
ఒంటరితనంతో ఎన్నో అనారోగ్యాలు

ఒంటరితనం అనుభవించేవారిలో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీర్ఘకాలంలో ఒంటరితనంతో బాధపడుతున్నవారిలో టైప్ 2 డయాబెటిస్, జ్ఞాపకశక్తి తగ్గడం, త్వరగా వృద్ధాప్యం రావడం, గుండె జబ్బులు వంటివి ఎక్కువవుతాయంటున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే క్లోజ్ అనిపించే వ్యక్తితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని, వీలైనంత ఎక్కువమందితో కమ్యునికేట్ చేయాలని సూచిస్తున్నారు.


