News November 19, 2025
పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
Similar News
News April 13, 2026
కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.
News April 13, 2026
మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్?

‘వృషకర్మ’ చిత్రంతో బిజీగా ఉన్న నాగ చైతన్య మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో తండ్రి నాగార్జునతో కలిసి మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో హీరోగా తన 25వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది లవ్&మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాలీవుడ్ టాక్.
News April 13, 2026
ట్రంప్ డెడ్‌లైన్.. మన పరిస్థితి ఏంటి?

ఇవాళ రా.7.30 గంటల నుంచి(IND కాలమానం) హార్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ ప్రకటన మనదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది. ఇరాన్‌కు టోల్ చెల్లిస్తూ ఆ దేశంలోని పోర్టుల్లోకి వెళ్లేవి, బయటికి వచ్చే అన్ని నౌకలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. దీంతో జలసంధి వద్ద గంభీర వాతావరణం నెలకొంది. అయితే హార్ముజ్‌పై ఆధిపత్యం ఎవరిదైనా మన నౌకలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని IND ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


