News January 10, 2026

పిల్లల అభ్యసన సామర్ధ్యాలపై ప్రత్యేక చొరవ

image

ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎలా చదువుతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి విద్యాశాఖ Foundational Literacy& Numeracy ప్రోగ్రాం చేపట్టింది. 75 రోజులు పాటు విద్యార్థులు చదవడం, రాయడం, లెక్కలు వేయడం ఇలా ఎందులో వెనుబడ్డారు అనేది తెలుసుకుంటారు. వీరిని 3 విధాలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 ప్రాథమిక పాఠశాలలు మినహా అన్నింటిలో మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News February 7, 2026

గుంటూరు: అంబటిపై 36 కేసులు..?

image

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 36 కేసులు నమోదైనట్లు సమాచారం. గుంటూరు, బాపట్ల, తూర్పు–పడమర గోదావరి, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. కాగా నల్లపాడు కేసులో ఆయనను అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ విధించింది. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు.

News February 7, 2026

పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లారు: CM

image

TG: ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసు ఇవ్వకపోతే ఏం చేస్తారని సీఎం రేవంత్ అన్నారు. ‘తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చామని కొందరు అంటున్నారు. తప్పు చేస్తే బేడీలు వేసి లాక్కొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు’ అని పరిగి బహిరంగ సభలో తెలిపారు.

News February 7, 2026

జనగామ: రెండో విడత ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 97 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలకు 97 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈవో జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 64 మంది, మధ్యాహ్నం 33 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, జనగామ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.