News January 1, 2026
పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ నేతృత్వంలో విశాఖలో పోక్సో చట్టంపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. పోక్సో కేసుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిందితుల్లో అధిక శాతం పరిచయస్తులే ఉంటున్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి పోలీసు, వైద్య శాఖల సహకారం కీలకమని, ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Similar News
News January 29, 2026
విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువల సవరణ

రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖ నగర వ్యాప్తంగా భూముల విలువలను సవరించింది. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ప్లాట్లకు ప్రతి చదరపు అడుగుకు రూ.100 పెంపు ప్రతిపాదించింది. ప్రస్తుతం చదరపు అడుగు రూ.4,200గా ఉండగా, కొత్తగా రూ.4,300గా నిర్ణయించారు. అయితే కమర్షియల్ ఆస్తుల విషయంలో చదరపు అడుగుకు రూ.100 తగ్గించారు. నిర్మాణాల కాంపోజిట్ రేట్లను కూడా పెంచనున్నారు. ఈ సవరించిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
News January 29, 2026
విశాఖలో ముగిసిన జాతీయ జైళ్ల అధికారుల సదస్సు

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన 9వ జాతీయ కారాగార నిర్వాహకుల సదస్సు గురువారం ముగిసింది. ముగింపు వేడుకలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని, సంస్కరణ నిలయాలుగా మారాలని ఆమె ఆకాంక్షించారు. టెక్నాలజీ వినియోగం, లేబర్ కోడ్ మార్పులు, ఖైదీల పునరావాసంపై సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
News January 29, 2026
విశాఖ: 481 మంది అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం

విశాఖలో అర్హులైన జర్నలిస్టులు 481మందికి తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం సమావేశం జరిగింది. జర్నలిస్టుల అర్హతలు, అంశాలపై చర్చించారు. 512 మందికి ప్రతిపాదించగా 481కి కమిటీ ఆమోదం లభించింది. ప్రింట్ 287, ఎలక్ట్రానిక్ మీడియా 194 దరఖాస్తులు అర్హత పొందాయి


