News December 10, 2025
పిల్లల పోషణలో ఐసీడిఎస్ కీలకం: కలెక్టర్

పిల్లల పోషణ, ఎదుగుదల, ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చడంలో ICDS శాఖ కీలకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో CDPOలు, సూపర్వైజర్లతో THR పంపిణీ, గ్రోత్ రిపోర్ట్, పోషణ ట్రాకర్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం దేశాభివృద్ధికి పునాదన్నారు. కిట్ల పంపిణీతో పాటు హిమోగ్లోబిన్, హైట్, వెయిట్ పెరుగుదలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.
Similar News
News April 13, 2026
‘B.Ed’ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.

‘ప్రజలు అందించే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి’

ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పీ.శ్రీజ, పీ.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పరిశీలన, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.