News February 3, 2025
పిసినికాడ సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
అనకాపల్లి మండలం పిసినికాడ సమీపంలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపూజీ అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాబుజీ రోడ్డు దాటుతుండగా విశాఖ వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Similar News
News February 3, 2025
సిరిసిల్ల: మహిళలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ అక్క: ఎస్పీ
జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు భద్రతకు జిల్లా షీ టీం, పోలీస్ అక్క భరోసా కల్పిస్తున్నాయని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై 03 కేసులు, 08 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఎవరైనా వేధింపులకు గురైతే 8712656425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
News February 3, 2025
NRPT: క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన
నారాయణపేట జిల్లా ఆసుపత్రి ఆవరణలో సోమవారం ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, క్యాన్సర్‌కు కారణమైన వాటికి దూరంగా ఉండాలని క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. న్యాయవాదులు, డాక్టర్లు పాల్గొన్నారు.
News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి
గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.