News October 5, 2025
పిసి ప్యాపిలి: ఒకే మొక్కకు 50 కాయలు

వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలిలో రైతు మీనుగ ఓబులేసు తన పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడం వల్ల పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. ఒకే మొక్కకు 50 కాయలు కాశాయంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
Similar News
News April 14, 2026
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్‌కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News April 14, 2026
ఆ విషయంలో వైభవ్ హ్యాపీగా లేడు: అసిస్టెంట్ కోచ్

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడంపై RR అసిస్టెంట్ కోచ్ ట్రెవోర్ పెన్నీ స్పందించారు. ‘ఫెరీరా గాయంతో బాధపడుతుండటంతో ప్రారంభ మ్యాచుల్లో సూర్యవంశీని పూర్తిగా ఆడించాం. ఫెరీరా కోలుకోవడంతో జట్టులోకి తీసుకున్నాం. అందుకే వైభవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు పంపుతున్నాం. అంతేతప్ప ఫీల్డింగ్ చేయట్లేదని కూర్చోపెట్టడం లేదు. ఈ విషయంలో అతడు సంతోషంగా లేడు’ అని తెలిపారు.
News April 14, 2026
ముఖంపై ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.


