News November 18, 2025

పిస్తా హౌస్, షా గౌస్, Mehfil హోటళ్లలో ఐటీ సోదాలు

image

TG: హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లైన పిస్తా హౌస్, షా గౌస్, Mehfil ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 50 టీమ్స్‌తో 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు హోటళ్లు ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. HYD, దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లోనూ బ్రాంచులు ఉన్నాయి.

Similar News

News November 18, 2025

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.

ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

image

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.