News September 23, 2025
పి. గన్నవరంలో టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవిపై గందరగోళం

పి. గన్నవరం నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న టీడీపీ ఇన్‌ఛార్జ్ పదవి ఎవరికి దక్కుతుందో తెలియక పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వెంటనే నియమించాలని ఎస్సీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ త్రిసభ్య కమిటీ కన్వీనర్‌గా మాజీ జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు కొనసాగుతున్నారు.
Similar News
News September 23, 2025
సంగారెడ్డి: ‘సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు’

వ్యవసాయ పరికరాల కోసం రైతులు 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై స్పేయర్స్, బ్రష్ కట్టర్స్, వివిధ రకాల పరికరాలను అందిస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో మండల వ్యవస్థ అధికారులను సంప్రదించాలని సూచించారు.
News September 23, 2025
H-1B వీసా: డాక్టర్లు, ఫిజీషియన్లకు ఊరట!

H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన US పలు <<17776599>>మినహాయింపులు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కీలక రంగాలకు ఊరటనిచ్చింది. ఇది డాక్టర్లు, ఫిజీషియన్లకూ వర్తించే అవకాశముంది. వైద్య, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, ఇంధనం, విమానయానం, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పనిచేసేవారికి మినహాయింపునిచ్చింది. వీటిలో నిపుణులకు ప్రత్యామ్నాయం కష్టమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News September 23, 2025
PDPL: ఒక్కో కార్మికుడికి రూ.1.95లక్షల BONUS!

సింగరేణి కార్మికులు 6నెలలుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను రూ.819 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కో పర్మినెంట్ ఎంప్లాయ్ ఖాతాలో రూ.1.95లక్షల వరకు బోనస్ జమ కానుంది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులూ నిరాశ చెందకుండా వారికీ ప్రభుత్వం రూ.17కోట్లను కేటాయించగా.. ఒక్కో కార్మికుడు రూ.5,500ల చొప్పున లబ్ధి పొందనున్నాడు. కాగా, దసరా, దీపావళి వేళ లాభాల ప్రకటనతో కార్మికుల కుటుంబాల్లో సంతోషం నెలకొంది.