News December 19, 2025
పి.గన్నవరంలో యాక్సిడెంట్.. యువకుడు మృతి

పి. గన్నవరం కొత్త బ్రిడ్జి సమీపంలో శుక్రవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. కొత్తపేట మండలంలోని అవిడికి చెందిన సుమంత్ కుమార్ (25) గన్నవరం సెంటర్‌కు వచ్చే సమయంలో బైక్ అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. అతడు అక్కడికక్కడే మృతి చెందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News December 22, 2025
మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
News December 22, 2025
ప్రభాకర్ రావును విచారించనున్న సజ్జనార్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు CP సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఛార్జిషీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ACP, DCP, జాయింట్ సీపీ స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
News December 22, 2025
నేడు ప్రజా అర్జీలు స్వీకరించనున్న బాపట్ల కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే PGRSకు జిల్లాస్థాయి అధికారులు అందరూ హాజరు కావాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు PGRS అర్జీలపై జిల్లా అధికారులతో సమావేశం ఉంటుందన్నారు. ప్రతి డివిజన్, మండల రెవెన్యూ కార్యాలయాలలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


