News February 16, 2025
పి.గన్నవరంలో 18 అంగుళాల దూడ

18 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన చేగొండి సత్యనారాయణ అనే పాడి రైతుకు చెందిన ఆవుకు శనివారం ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు.
Similar News
News July 5, 2025
HYD: POLYCET ఫేజ్-1 రిజల్ట్ కోసం ఎదురుచూపులు..!

HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో POLYCET-2025లో ఉత్తీర్ణులైన అనేక మంది కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫేజ్-1 కోసం వెబ్ ఆప్షన్లు సైతం అందజేశారు. అయితే శుక్రవారం ఫేజ్-1 అలాట్మెంట్ రిజల్ట్ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. మొబైల్ ఫోన్లకు మెసేజ్లు ఎప్పుడు వస్తాయో అని ఉత్తీర్ణులైన విద్యార్థులు రాత్రంతా ఎదురుచూశారు. మరోవైపు రేపే సీటు వచ్చిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంది.
News July 5, 2025
బాలికను మోసగించిన వ్యక్తికి జైలు శిక్ష

బాలికను పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తికి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి 22 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దామరచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మహేశ్ ప్రేమ పేరుతో లోబరుచుకొని గర్భవతిని చేశాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం శిక్షతో పాటు రూ.35 వేల ఫైన్, బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని DLSA ఆదేశించింది.
News July 5, 2025
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైరబోయిన వెంకటేశ్వర్లు (36) రాత్రి పీర్ల ఊరేగింపులో ఉండగా ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే హత్యకు గురైన వ్యక్తి సుమారు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా హత్యకు గురయ్యాడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.