News September 4, 2025

పీఆర్‌టీయూ నల్గొండ జిల్లా కమిటీ ఎన్నిక

image

పీఆర్‌టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా చిలుముల బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బొమ్మపాల గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నల్గొండలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో సంఘం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ కవిత, ఇమామ్ కరీం తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.

News November 4, 2025

నల్గొండ: ‘గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆహార భద్రత కార్డులను మంజూరు చేస్తున్న సందర్భంగా గృహజ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని నూతన లబ్ధిదారులు కోరుతున్నారు. రేషన్ కార్డ్ లేకపోవడం వల్లే గతంలో నిర్వహించిన ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అధికారులు స్వీకరించలేదని వారు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారు 60 వేల మంది నూతన కార్డుదారులు ఉన్నారు.

News November 4, 2025

NLG: ఆందోళన బాటలో ప్రైవేట్ కాలేజీలు

image

జిల్లాలు ప్రైవేట్ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాబితాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు కళాశాల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతో పాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల ఎదుట బంద్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.