News December 26, 2025
పీఆర్సీ ప్రకటించకపోతే మారో ఉద్యమం: UTF

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2023 జూలై 1 నుంచి పీఆర్సీని వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29న జరిగే మహాసభలను ఉపాధ్యాయులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 27, 2025
నేడు CWC కీలక భేటీ

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు. ఈ భేటీలో ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ముఖ్యంగా చర్చించే అవకాశముంది. అలాగే త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ స్ట్రాటజీ ఖరారు చేయనున్నట్లు సమాచారం.
News December 27, 2025
పెద్ద దానం చేస్తే ఎక్కువ ఫలం ఉంటుందా?

దానం ఎంత పెద్దది అనే దాని కంటే, ఎంత తృప్తిగా చేశామన్నదే ముఖ్యం. భక్తితో చేసే చిన్న సాయమైనా ఎంతో పుణ్యాన్నిస్తుంది. శక్తికి మించి దానం చేయాల్సిన అవసరం లేదు. స్తోమతను బట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి తోడ్పడటం ఎంతో గొప్పది. స్వార్థం లేని త్యాగం, దయాగుణంతో ఇచ్చే పిడికెడు ధాన్యమైనా.. అది దైవదృష్టిలో గొప్ప దానంగా పరిగణిస్తారు. ప్రేమతో చేసే చిన్న సాయం జీవితంలో వెలుగు నింపుతుంది.
News December 27, 2025
జాగ్రత్త.. మరింత వణికించనున్న చలి

AP: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అరకు, పాడేరు ప్రాంతాల్లో 4-12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోనూ చలి పెరిగింది. ఉత్తర భారతం నుంచి గాలులు, హిమాలయాల్లో కురుస్తున్న భారీ మంచు వల్ల శీతల తరంగాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో చలి పెరిగిందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వచ్చేవారం మరింత పెరిగే ఆస్కారముందని అంచనా వేస్తున్నారు.


