News August 8, 2024
పీఎం విశ్వకర్మ యోజనకు రిజిస్ట్రేషన్ చేసుకోండి: చిత్తూరు కలెక్టర్

పీఎం విశ్వకర్మ యోజన ద్వారా లబ్ధిపొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. 5 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్ అందిస్తారని చెప్పారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు.
Similar News
News February 18, 2026
చిత్తూరు DMHOగా డా.నాగశశి భూషణ్ రెడ్డి

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నాగశశి భూషణ్ రెడ్డిని నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో DIO అధికారిగా విధులు నిర్వహిస్తున్న నాగ శశి భూషణ్ రెడ్డిని DMHOగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. త్వరలో ఈయన బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు.
News February 18, 2026
CM రిక్వెస్ట్.. కుప్పంలో 2 ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపింగ్

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.
News February 17, 2026
సర్టిఫికెట్ల పరిశీలనకు DEOకు లేఖ: CDPO

అంగన్వాడీ ఉద్యోగాలకు అభ్యర్థులు సమర్పించిన టెన్త్ సర్టిఫికెట్లను పరిశీలించాలంటూ DEOకు లేఖ రాసినట్లు కుప్పం CDPO చంద్రకళ తెలిపారు. అయితే, కలెక్టర్ ద్వారా ఆదేశాలు రావాలని DEO చెప్పడంతో కడ PD ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సర్టిఫికెట్లు ఒరిజినల్ Or ఫేక్ అన్నది విద్యాశాఖ అధికారుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. కుప్పంలో 10th ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వారిని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.


