News February 21, 2026

పీఎం సూర్యఘర్ అమలులో పురోగతి సాధించాలి: కలెక్టర్

image

PM సూర్యఘర్, PM కుసుం పథకాల అమలులో జిల్లా యంత్రాంగం వేగంగా పురోగతి సాధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి CS విజయానంద్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ, హాస్టళ్లలో సౌకర్యాలు, పారిశుద్ధ్యం గంజాయి నియంత్రణపై సమీక్షించారు. విద్యుత్ పొదుపుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.

Similar News

News February 21, 2026

3 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి

image

ఖమ్మం: గత 12 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం జరగలేదని, ఈ ఏడాది రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. శనివారం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం గుర్తించిన 11.57 లక్షల మంది అర్హులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News February 21, 2026

KNR: టీజీవో డైరీని ఆవిష్కరించిన కలెక్టర్‌ పమేలా సత్పతి

image

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా డైరీ-2026ను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు కాళిచరణ్ ఆధ్వర్యంలో గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అసోసియేషన్ రూపొందించిన ఈ డైరీలో ఉద్యోగులకు అవసరమైన సమాచారం పొందుపరచడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇది విధుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

News February 21, 2026

కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా పారదర్శకతతో లక్ష్యాలను చేరుకోవాలని ఆమె స్పష్టం చేశారు.