News February 21, 2025

పీఎం సూర్య‌ఘ‌ర్ లక్ష్యాల‌పై దృష్టిపెట్టండి: కలెక్టర్

image

పీఎం సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కం కింద రిజిస్ట్రేష‌న్ల‌తో పాటు సౌర ఫ‌ల‌కాల ఏర్పాటుపై ప్ర‌తి మండ‌లానికి నిర్దేశించిన ల‌క్ష్యాల‌పై అధికారులు దృష్టిసారించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. ఈ మేరకు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్లో పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై కలెక్టర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అనంతరం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన రిజిస్ట్రేష‌న్లతో పాటు ఇన్‌స్ట‌లేష‌న్స్‌పై చ‌ర్చించారు. 

Similar News

News November 9, 2025

కడప: వివాదంగా మారిన టీచర్లు టూర్

image

మైదుకూరు మండలం నంద్యాలం పేట కాంప్లెక్స్ పరిధిలోని 20మంది టీచర్లు ఒకేసారి సెలవు పెట్టి టూర్‌కు వెళ్లారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్ల నుంచి సైతం సెలవు పెట్టడం వివాదాస్పదమైంది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండో శనివారం లీవ్ ఉంటుందని టీచర్లు ముందుగానే టూర్ ప్లాన్ చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆ లీవ్ రద్దు చేశారు. టూర్ క్యాన్సిల్ చేసుకోలేక అందరూ వెళ్లారు.

News November 9, 2025

సీఎం చేతికి తిరువూరు నివేదిక.. చంద్రబాబు ఏమన్నారంటే..!

image

విజయవాడ ఎంపీ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ల వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు నివేదిక, పెన్ డ్రైవ్‌ను అందించారు. నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ పంచాయితీపై తన వద్ద కూడా సమగ్ర నివేదిక ఉందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. త్వరలో ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడతానని ఆయన వెల్లడించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

News November 9, 2025

ఒలింపిక్స్ 2028: IND vs PAK మ్యాచ్ లేనట్లే!

image

2028 నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీలు అనగానే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఉండాల్సిందే. కానీ ఈ ఈవెంట్‌లో ఇరు జట్లు తలపడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కడం కష్టంగా మారడమే దీనికి కారణం. ఒక్కో ఖండం నుంచి ఒక్కో <<18233382>>జట్టును<<>> ఎంపిక చేయాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.