News October 13, 2025
పీజీఆర్‌ఎస్‌కు 24 అర్జీలు: ఎస్పీ రాహుల్ మీనా

పీజీఆర్‌ఎస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 24 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Similar News
News October 13, 2025
భూపాలపల్లి: బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు చెల్లించాలి: కలెక్టర్

భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అన్ని శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగా జీతాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సంక్షేమ కార్యక్రమాలు పరిశీలన, ముందస్తు అనుమతులు లేకుండా సెలవులు వినియోగం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు.
News October 13, 2025
పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సమీక్ష

ఈ నెల 17న రాజోలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ మహేశ్ కుమార్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌తో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. పవన్ ‘పల్లె పండుగ 2.0’ పనులను ప్రారంభిస్తారని, చనిపోయిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పర్యటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 13, 2025
సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం: సిరిసిల్ల ఎస్పీ

బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేష్ బి.గీతే అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.