News January 6, 2026

పీజీఆర్‌ఎస్‌లో 13 అర్జీలు స్వీకరించిన ఎస్పీ

image

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జిల్లా నలుమూలల నుంచి 13 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమారావు పాల్గొన్నారు.

Similar News

News February 6, 2026

రేపు రైస్ మిల్లర్లకు ఎంఎస్‌ఎంఈపై అవగాహన: కలెక్టర్

image

పెదమిరంలోని నిర్మల ఫంక్షన్ హాల్‌లో శనివారం ఈనెల 7 ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యజమానులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News February 6, 2026

ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని: జేసీ

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ప్రజల పూర్తిస్థాయిలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం భీమవరం 21వ వార్డు పెద్ద పేట కుసుమ ప్రియ అపార్ట్మెంట్ వద్ద నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియలో జేసీ స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడారు. సర్వేను త్వరితగతం పూర్తి చేయాలన్నారు.

News February 6, 2026

వాడి వేడిగా ఆచంట రాజకీయం (1/2)

image

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తీరుకు దీటుగా వైసీపీ సర్పంచ్‌లు సవాలు విసురుతున్నారు. గతంలో తమపై ఆంక్షలు విధించారన్న అసంతృప్తితో సర్పంచ్‌లు ప్రతిఘటిస్తుండటంతో.. అక్కడ అధికార, ప్రతిపక్షాల నడుమ హోరాహోరీ వాతావరణం నెలకొంది.