News April 9, 2025
పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్‌మెంట్ అవ్వొద్దు: కలెక్టర్

పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్‌మెంట్ అవ్వొద్దని, అందులో సంబంధించిన ఉత్తర్వులు కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆర్డీవో, తహశీల్దార్లు, మండల సర్వే అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ అర్జీలు, వాటి పరిష్కార విధానం, ఐవీఆర్‌ఎస్ ఫిర్యాదులపై ప్రతిస్పందన వ్యవస్థపై చర్చించారు.
Similar News
News April 17, 2025
నిడదవోలు: ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

నిడదవోలు డిపో నుంచి హైదరాబాద్‌కి RTC నూతన సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. చాగల్లు- పంగిడి -దేవరపల్లి – జంగారెడ్డిగూడెం- ఖమ్మం మార్గంలో ఈ బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కే.వెంకటేశ్వర్లు అన్నారు. రేపు సాయంత్రం 4:30 నిమిషాలకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు నిడదవోలు ప్రాంత ప్రజలు సర్వీస్‌ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
News April 17, 2025
రాజమండ్రి: ‘జనరల్ వార్డుల్లోనే ప్రసవాలు జరగడం శోచనీయం’

స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేని దయనీయ స్థితిలో ఉందని మాజీ ఎంపీ భరత్ రామ్ విమర్శించారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ హయాంలో అన్ని వసతులు కల్పించడం వల్లే వైద్య సేవలు పేదలకు మరింత చేరువ అయ్యాయన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆపరేషన్ థియేటర్లలో కాకుండా జనరల్ వార్డులలోనే ప్రసవాలు జరగడం దురదృష్టకరమన్నారు.
News April 17, 2025
రాజమండ్రి: తల్లిదండ్రులు ఒక్కటవ్వాలని కుమార్తె సూసైడ్

చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కలిసి ఉండటం చూడలేదు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరంగా ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తన మరణంతోనైనా ఒక్కటిగా ఉండాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. జంగారెడ్డిగూడెంకు చెందిన లేఖశ్రీ 3 ఏళ్ల వయసు నుంచే అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి రవి, తల్లి నాగదుర్గాదేవి రాజమండ్రిలో వేరుగా ఉంటున్నారు. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది.