News October 21, 2024

పీయూలో బాస్కెట్‌బాల్, క్రికెట్ క్రీడాకారుల ఎంపికలు

image

ఈనెల 23న పాలమూరు యూనివర్సిటీలో పురుషుల  బాస్కెట్‌బాల్, 25న స్త్రీ, పురుషు క్రికెట్ క్రీడారులను ఎంపిక చేయనున్నట్లు పీయూ PD శ్రీనివాసులు సోమవారం తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొన వచ్చన్నారు. 17-25 ఏళ్ల వయసు ఉండి, చదువుతున్న కళాశాల బోనోఫైడ్ తీసుకురావాలన్నారు. బ్యాట్మింటన్, టైక్వాండో 18,19 టైక్వాండో స్త్రీ, పురుషులు స్త్రీ, పురుషులు కబడ్డీ-21న ఎంపిక చేస్తామన్నారు.

Similar News

News November 5, 2025

నవాబుపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో వివిధ ప్రాంతాలలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది అత్యధికంగా నవాబుపేటలో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. మిడ్జిల్ మండలం దోనూరు 21.8, జడ్చర్ల 8.5, మహబూబ్‌నగర్ రూరల్ 4.8, అడ్డాకుల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News November 5, 2025

పాలమూరు వర్సిటీకి మరో గౌరవం

image

పాలమూరు వర్సిటీ విద్యా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.శ్రీనివాస్ “వాలీబాల్ ప్లేయర్స్‌పై డాటా డ్రీవన్ మానిటరింగ్ సిస్టం” అనే అంశంపై యూటిలిటీ పేటెంట్ పొందారు. ఈ మేరకు ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు ఆయనను అభినందించారు. నూతన ఆవిష్కరణల్లో మరింత చురుకుగా పాల్గొనాలని వీసీ కోరారు.

News November 4, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 28.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. చిన్నచింతకుంట 19.5, మిడ్జిల్ 11.3, కౌకుంట్ల 18.8, దేవరకద్ర 17.0, మహబూబ్‌నగర్ గ్రామీణ 9.8, అడ్డాకుల 8.5, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.