News February 12, 2025
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353645527_50031802-normal-WIFI.webp)
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తన హక్కును కోరడాన్ని చిన్నచూపుగా అభివర్ణించడం బాధాకరమని మంత్రి అన్నారు. దేశానికి భారీగా ఆదాయం అందిస్తున్న తెలంగాణకు తగిన న్యాయం జరగాలని కోరడం న్యాయమేనని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వాటి అభివృద్ధికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
Similar News
News February 12, 2025
ధరూర్: ఏసీబీ కోర్టులో ఎస్‌ఐ.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365189383_20512937-normal-WIFI.webp)
ఏసీబీకి చిక్కిన ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్‌పై రిమాండ్ అనంతరం పోలీస్ శాఖ పరమైన చర్యలు తీసుకోనుంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ మంగళవారం ఓ కేసు వ్యవహారంలో రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్‌తో సహా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్‌ను, డ్రైవర్‌ను హాజరుపరిచారు.
News February 12, 2025
మందమర్రి PHCని సందర్శించిన DMHO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365028483_50225406-normal-WIFI.webp)
మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గదులతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఉన్న క్వార్టర్లను వారం లోపల శుభ్రం చేయించాలని ఆదేశించారు.
News February 12, 2025
సిరిసిల్ల: గంజాయి సాగుచేస్తూ.. తాగుతున్న వ్యక్తుల అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363774594_51855990-normal-WIFI.webp)
సిరిసిల్ల మండలం పెద్దూరు మెడికల్ కాలేజీ పక్కన 4 వ్యక్తులు గంజాయిని సాగుచేస్తూ.. తాగుతుండగా వారిని అరెస్ట్ రిమాండ్ తరలించామని CI కృష్ణ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దేద్రాడ్ ధలి, మాలే మాలిక్, ప్రణబ్ సింగ్, సాగర్ సర్కార్ అనే వ్యక్తులు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వచ్చారు. పక్కనే ఉన్న స్థలంలో గంజాయి మొక్కలను సాగుచేస్తూ.. తాగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని 50G గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.