News October 21, 2024
పీయూ నూతన ఉపకులపతిగా శ్రీనివాస్ బాధ్యతలు

పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. వారికి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, పలువురు అధ్యాపకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి కల్పనకు ఉపయోగపడే కోర్సులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని, మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు.
Similar News
News May 8, 2025
మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.