News November 20, 2024

పీయూ PHD సెల్ కో-ఆర్డినేటర్‌గా కిషోర్

image

పాలమూరు యూనివర్సిటీ PHD సెల్ కో-ఆర్డినేటర్‌గా సూక్ష్మ జీవ శాస్త్రం విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్‌ను నియమిస్తూ వీసీ ప్రొ. శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ కిషోర్ గతంలో చీఫ్ వార్డెన్‌గా, సంయుక్త సంచాలకులుగా, పాలకమండలి సభ్యులుగా, ప్రిన్సిపాల్‌గా, విభాగాధిపతిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

Similar News

News February 1, 2025

ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి చిన్నారులు మృతి

image

ఉదండాపూర్ రిజర్వాయర్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. ఉదండాపూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు ఉదండాపూర్ రిజర్వాయర్ పక్కన వ్యవసాయ పొలం ఉంది. వారి ఇద్దరు పిల్లలు భాగ్యలక్ష్మి(7), మహేష్(4) శనివారం పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ప్రాజెక్టు నీటిని గుంతలో పడడంతో మహేష్ మృతదేహం లభించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News February 1, 2025

MBNR: బి-ఫార్మసీ పరీక్షలు ప్రారంభం

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బి-ఫార్మసీ సెమిస్టర్-3 పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ చెన్నప్ప, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బార్కోడ్స్‌పై వివరాలు సరిచూసుకోవాలని, పరీక్షల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News February 1, 2025

NGKL: మైనర్‌ బాలికకు వేధింపులు.. కేసు నమోదు

image

ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.