News January 16, 2026

పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

image

నెలసరి సమయంలో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.

Similar News

News February 14, 2026

ఉల్లి.. రూ.100కే 6 కేజీలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.100కే 6 కేజీలు విక్రయిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.20కి అమ్ముతున్నారు. టమాటా రేట్లు కూడా పడిపోయాయి. కేజీ రూ.10-15 పలుకుతోంది. వంకాయ కేజీ రూ.25-30కే లభిస్తోంది. దొండకాయ రూ.50, పచ్చిమిర్చి రూ.50, క్యాప్సికం రూ.45కు విక్రయిస్తున్నారు.

News February 14, 2026

గురుపత్వంత్ హత్యకు కుట్ర.. అంగీకరించిన ఇండియన్

image

ఖలీస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ హత్యకు యూఎస్‌లో కుట్ర పన్నినట్లు ఇండియన్ నిఖిల్ గుప్తా US కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యకు కుట్ర, మనీలాండరింగ్, కిరాయి హత్య <<14361092>>అభియోగాలు<<>> మోపారు. గరిష్ఠంగా 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అయితే 21-25 ఏళ్లకు శిక్షను తగ్గించాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సిఫార్సు చేయడం గమనార్హం. మే 29న శిక్ష ఖరారు చేయనున్నారు.

News February 14, 2026

విటమిన్స్ లోపం-లక్షణాలు

image

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, B విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ B12) లోపం. చర్మంపై రాషెస్‌తో పాటు, వెంట్రుకలు రాలుతూ ఉంటే బయోటిన్ (విటమిన్ B7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే ఫోలేట్, B6, B12 లోపముందని గుర్తించాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.