News August 27, 2025
పీలేరు: వినాయక చవితి వేడుకల్లో అపశృతి

పీలేరులోని బీవీ రెడ్డి కాలనీ సెంటర్లో బుధవారం వినాయక చవితి వేడుకలలో అపశృతి చోటుచేసుకుంది. గంధంతో తయారైన నాట్య వినాయకుడి మండపంలో హారతి ఇస్తుండగా బలమైన గాలికి హారతి అలంకరణ వస్త్రంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో మండపం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తం కావడంతో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.
Similar News
News August 27, 2025
కృష్ణానగర్‌లో హైడ్రా నాలా ఆపరేషన్

నాలాలో ఒకటిరెండు అడుగుల పూడిక సహజమే. కానీ.. HYD కృష్ణానగర్‌లో 8 అడుగుల లోతైన నాలాలో 6 అడుగుల మేర సిల్ట్ పేరుకుపోవడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. 2 మీటర్ల పూడిక తీయగానే 7,8 ట్రాక్టర్లు నిండుతున్నాయి. 8 అడుగుల లోతు, ఆరడుగుల మేర పూడికతీత పనులు నిర్వహిస్తున్నట్లు హైడ్రాధికారులు తెలిపారు. కమిషనర్ రంగనాథ్ సైతం పరిశీలించినట్లు వివరించారు.
News August 27, 2025
HYD: 20 నిమిసాల్లో భార్యను ముక్కలుగా చేశాడు!

మేడిపల్లి స్వాతి దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి మృతదేహాన్ని 20 నిమిషాల్లోనే ముక్కలు చేసి మూసీ నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. గత 4 రోజులుగా DRF బృందాలు ఆమె శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
News August 27, 2025
HYD: వర్షం పడిన ప్రతీసారి ఈ మార్గాల్లో ట్రాఫిక్

వర్షం పడితే HYDలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. గచ్చిబౌలి- మియాపూర్, లింగంపల్లి- హైటెక్ సిటీ, జేఎన్టీయూ- హఫీజ్‌పేట్- KPHB, బొటానికల్ గార్డెన్- కొత్తగూడ, టోలిచౌకి- రాయదుర్గం, షేక్‌పేట్ ఫ్లూఓవర్, కోఠి- ఎల్బీనగర్ వంటి ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ కారిడార్ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరగడం కారణంగా సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.