News March 13, 2025

పీ 4 సర్వేతో ప్రతీ గృహానికి లబ్ధి చేకూరుతుంది: కలెక్టర్

image

ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యం (పీ4) సర్వేతో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. బుధవారం విజయవాడ కలెక్టరేట్ ఛాంబర్‌లో ప్రణాళిక శాఖ రూపొందించిన అవగాహన, క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్ను‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 దిశగా ముందుకు వెళుతుందన్నారు.

Similar News

News February 25, 2026

సూర్యాపేట: వార్షిక రుణ లక్ష్యానికి చేరువలో బ్యాంకులు: కలెక్టర్

image

జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో 88.44 శాతం వృద్ధి సాధించామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.11,919 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.10,541 కోట్లు రుణాల రూపంలో అందించామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 96 శాతం పురోగతి సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.

News February 25, 2026

మేడ్చల్: సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాయని 2,099 స్టూడెంట్స్

image

ఇంటర్ పరీక్షలలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొదటిరోజు ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో 70,268 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 68,169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 2,099 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు.

News February 25, 2026

తిరుపతి: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

image

మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.