News August 4, 2025

పీ-4 స్వచ్ఛంద కార్యక్రమం.. ఎవరిపైనా ఒత్తిడి లేదు: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర 2047 ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా అధికారులు కృషి చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. పీ-4 మార్గ‌ద‌ర్శుల ఎంపిక ప్ర‌క్రియ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌న్నారు. ఇది పూర్తిగా స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మ‌మ‌ని, ఎవరిపైనా ఒత్తిడి లేద‌ని క‌లెక్టర్ స్ప‌ష్టం చేశారు. బంగారు కుటుంబాల‌కు సాయం అందించే విధంగా మార్గ‌దర్శుల‌ను మ్యాపింగ్ చేయాలన్నారు.

Similar News

News September 11, 2025

బ్లూమ్‌బర్గ్ ఛాలెంజింగ్ పోటీలకు విశాఖ ఎంపిక

image

బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో విశాఖ ఎంపికైందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 99 దేశాల్లో 600 నగరాలు పోటీ పడగా 50 నగరాలను ఫైనల్‌కు చేశారని, ఇందులో విశాఖ నిలిచిందని చెప్పారు. ప్రతి పౌరుడు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్‌తో తమ ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు పంచుకోవాలన్నారు. ఈనెలలో 19వ వార్డులో వర్క్ షాప్ నిర్వహించనున్నామన్నారు.

News September 10, 2025

విశాఖ: ‘రాత్రి వేళల్లో అదనపు సర్వీసులు వేయాలి’

image

విశాఖలో రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులు అదనపు సర్వీసులు నిర్వహించాలని పలువురు ప్రయాణికులు కోరారు. బుధవారం జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు డైల్ యువర్ ఆర్‌ఎం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు ఆయనకు పలు సూచనలు చేశారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు వేయాలని కోరారు. నిర్ణీత సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బస్సులు నడపాలన్నారు.

News September 10, 2025

విశాఖలో ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభం

image

విశాఖ మెడటెక్ జోన్‌లో అత్యాధునిక ఈ-వ్యర్థాల ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభమైంది. ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్ (ప్రధాన శాస్త్రీయ సలహాదారు), డా.పర్వీందర్ మైనీ (శాస్త్రీయ కార్యదర్శి), మెడటెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ, GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్, బయోమెడికల్ పరికరాల వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేసి మళ్లీ వినియోగించేలా ఈ కేంద్రం పని చేస్తుందని అధికారులు తెలిపారు.