News April 17, 2024
పుంగనూరులో ఉద్రిక్తత

పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్త హేమాద్రిని వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జానపద కళల అకాడమీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటి వద్దకు వారు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ, టీడీపీ నాయకులను వెళ్లగొట్టారు. పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News October 8, 2025
చిత్తూరు: పోలీస్ కస్టడీకి పూర్వ ఆర్డీవో

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో మరో కదలిక వచ్చింది. పూర్వ ఆర్డీవో మురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మురళికి ఇచ్చిన మద్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయనను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును ఆశ్రయించింది.
News October 8, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో కుప్పం మండలం నూలుకుంట కు చెందిన వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 7, 2025
కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ ములకలచెరువు ఎక్సైజ్ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.