News July 2, 2024

పుంగనూరులో పింఛన్ల పంపిణీలో చేతివాటం

image

పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించిన ఘటన పుంగనూరులో జరిగింది. మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనరసింహ ప్రసాద్ వివరాల మేరకు.. పట్టణంలోని 6వ వార్డు సెంటర్ లాడ్జి ప్రాంతంలో నిన్న పింఛన్ల పంపిణీ జరిగింది. మహేశ్ అనే సచివాలయ ఉద్యోగి రూ.2.50 లక్షలు కాజేశాడు. తోటి ఉద్యోగులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్ బంధువులు నగదు తిరిగి ఇచ్చేశారు.
NOTE: ఫొటోలో ఉన్నది కమిషనర్.

Similar News

News February 19, 2026

పలమనేరులో రూ.13.4 కోట్లకు ఐపీ

image

పలమనేరులో మరో ఐపీ బాంబు పేలింది. పలమనేరుకు చెందిన రియల్ ఎస్టేట్, సీజనల్ వ్యాపారి వెంకటరావు పలువురు దగ్గర అప్పులు తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో 71 మందికి రూ.13.4 కోట్లకు కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పట్టణంలో చీటీలు నిర్వహించడం, వ్యాపారాల కోసం అప్పులు తీసుకుని ఐపీ పెట్టడం రివాజుగా మారింది. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు.

News February 19, 2026

సోమల: ఉదయాన్నే రోడ్డు ప్రమాదం

image

సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు. గాయపడినవారిది చౌడేపల్లిగా స్థానికులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2026

చిత్తూరు: ఉపవాస దీక్షలు ప్రారంభం

image

జిల్లాలో ముస్లింలు గురువారం ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.