News April 27, 2024
పుంగనూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ప్రసన్నగారిపల్లె గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు జగదీష్ (15) స్కూలుకు సెలవులు కావడంతో గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
చిత్తూరు: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుకు దరఖాస్తులు

అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు చేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు.APPSDC స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ఉచిత అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కోర్సుకు 5 నుంచి ఏదైన ఉన్నత విద్యవరకు చదివిన వారు అర్హులన్నారు. ఈనెల 26 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 14, 2025
చిత్తూరు: 17న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

ఈనెల 17న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలియజేశారు. జిల్లాలోని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ సెమినార్ పోటీలకు అర్హులన్నారు. క్వాంటం యుగం ప్రారంభం-అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 17న ఉ.10 గంటలకు జిల్లా కేంద్రం లోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సెమినార్ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.
News October 14, 2025
చిత్తూరు: యువతకు క్రీడా పోటీలు

వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువతకు వివిధ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ బాగా ఆడితే జాతీయస్థాయిలో నిర్వహించే యువజన పోటీలకు పంపిస్తామని చెప్పారు. జిల్లాస్థాయి పోటీలు ఈనెల 15న చిత్తూరు సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతాయన్నారు.