News August 25, 2025
పుంగనూరు: గుండెపోటుతో VRO మృతి

పుంగనూరు మండలంలోని ఆరడిగుంట గ్రామ సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ(45) ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఇంట్లోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని పలువురు సందర్శించి, సంతాపం తెలియజేశారు.
Similar News
News August 26, 2025
చిత్తూరు ప్రజలకు చవితి శుభాకాంక్షలు: ఎస్పీ

చిత్తూరు జిల్లా ప్రజలకు ఎస్పీ మణికంఠ చందోలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. సామరస్యంతో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే వినాయక చవితిని సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మండప నిర్వాహకులు సూచనలు పాటించాలన్నారు. నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.
News August 26, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు నుంచి కాణిపాకానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీపీటీఓ రాము తెలిపారు. సాధారణ రోజుల్లో ఐదు బస్సులు 55 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. చవితి రోజు 12 బస్సులు, 130 ట్రిప్పులు తిరిగేలా చూస్తామన్నారు. అలాగే పుష్పపల్లకి, రథోత్సవానికి పది బస్సులు కేటాయించగా 110 ట్రిప్పులు తిప్పుతామన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News August 25, 2025
చిత్తూరు జిల్లాలో 5,27,680 కుటుంబాలకు కార్డులు పంపిణీ

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేటి నుంచి మొదలుకానుంది. చిత్తూరు జిల్లాలో 5,27,680 కుటుంబాలకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుంచి కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుని ఫొటో, ఏటీఎమ్ కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉండనుంది.