News April 14, 2025

పుంగనూరు: టీచర్ మృతి.. అసలేం జరిగిందంటే?

image

పుంగనూరు మండలం సుగాలిమిట్టలో లారీ ఢీకొని నిన్న ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే. కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లెకు చెందిన శారద(40) కదిరిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. విజయవాడలో ఆమె కుమార్తె కీర్తి ఇంటర్ చదువుతుండగా 973 మార్కులు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి కుమార్తెను తీసుకుని అరుణాచలం వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా లారీ ఢీకొని చనిపోయారు.

Similar News

News April 16, 2025

చిత్తూరు: కంట్రోల్ సెంటర్ పరిశీలించిన ఎస్పీ

image

చిత్తూరులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం సందర్శించారు. సీసీ కెమెరాల నియంత్రణ, ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజం వంటి అంశాలను పరిశీలించారు. సెంటర్ నెట్వర్క్‌ను అనుసంధానించబడిన ముఖ్య కూడలిలో సీసీ కెమెరాలు దృశ్యాలను లైవ్‌గా పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. శక్తి యాప్‌లో SOS సంకేతం ద్వారా ఫిర్యాదులను కంట్రోల్ సెంటర్ సిబ్బంది చూడాలన్నారు.

News April 16, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి రూరల్ BTRకాలనీలో ఓ వృద్ధుడు స్థానికంగా ఉంటున్న పిల్లలకు తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. నిన్న తన ఇంట్లో ముగ్గురు చిన్నారులకు వీడియోలు చూపిస్తుండగా స్థానికులు గమనించారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మేస్త్రి పనులు చేసే సెల్వంగా గుర్తించి అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

News April 16, 2025

చిత్తూరు: ‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధి జర్నలిస్టులే’

image

ప్రభుత్వానికి, ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటి వారు అని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఈ నెల 22న జరగనున్న APWJF 4వ జిల్లా మహాసభలకు ఆహ్వానిస్తూ కలెక్టర్ ఛాంబర్‌లో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వాస్తవాలను ప్రచురించడంలో జర్నలిస్టులు కృషి చేస్తున్నారన్నారు. వారి సంక్షేమానికి అండగా ఉంటామన్నారు.

error: Content is protected !!