News July 8, 2024
పుంగనూరు: న్యాయ విభాగం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి

వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్న నేపథ్యంలో వారికి అండగా ఉండేలా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయ విభాగం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం నలుగురు లాయర్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. దాడులను అడ్డుకుంటే.. తిరిగి వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దారుణమని వెల్లడించారు.
Similar News
News February 22, 2026
కుప్పం: బస్ పాస్, హాల్ టికెట్ చూపిస్తే RTC బస్సులో ఫ్రీ

ఇంటర్ పరీక్షలకు సంబంధించి బస్ పాస్ తోపాటు హాల్ టికెట్ చూపిస్తే RTC ఆర్డినరీ బస్సులో ఎగ్జామ్ సెంటర్ కు ఫ్రీగా ప్రయాణించవచ్చని కుప్పం RTC డిపో మేనేజర్ TK స్వామి తెలిపారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం పూట బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షల సమయంలో RTC బస్సులు నడుపుతామన్నారు. విద్యార్థినులు ఆధార్ కార్డు చూపించిన ఉచితంగా వెళ్లవచ్చునారు.
News February 22, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 21, 2026
పలమనేరు: APO సస్పెండ్.. అసిస్టెంట్లకు నోటీసులు..!

పలమనేరు ఉపాధి హామీ పనుల్లో <<19204298>>అవినీతి<<>> జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్‌లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.


