News November 24, 2025

పుట్టపర్తిలో ఉత్సవాలు బ్లాక్‌బస్టర్!

image

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.

Similar News

News November 24, 2025

కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

image

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.

News November 24, 2025

ఆ మద్యం దుకాణాన్ని తొలగించండి: నంద్యాల కలెక్టర్

image

నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

News November 24, 2025

HYD: జాతీయ శిక్షణకు బాలికలకు అవకాశం

image

రంగారెడ్డి జిల్లాలో 12-16 ఏళ్ల బాలికల కోసం ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 60M, 600M, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 28న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉ.8 గం.కు రిపోర్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. జిల్లా స్థాయిలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయి క్యాంపులో ప్రత్యేక శిక్షణ లభిస్తుంది.