News January 10, 2025
పుట్టపర్తిలో వివాహిత ఆత్మహత్యాయత్నం

పుట్టపర్తిలోని చిత్రావతి నదిలో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన నదిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని కుమ్మరపేటకు చెందిన నాగవేణిగా గుర్తించారు. భర్త బాలరాజు ఆటోతో జీవనం సాగిస్తున్నారు. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News October 25, 2025
రాయదుర్గం: ఇన్స్టాగ్రాం పిచ్చి.. మృత్యువుకు దారి తీసింది

BTP డ్యాం స్పిల్ వే గేటు వద్ద గల్లంతైన యువకుడి వివరాలు లభ్యమయ్యాయి. రాయదుర్గంలోని కలేగార్ వీధికి చెందిన ముగ్గురు యువకులు డ్యాం గేట్లు ఓపెన్ చేస్తుండటంతో ఇన్స్టాగ్రాం వీడియోల కోసం వెళ్లారు. అందులో ఇద్దరు నీటిలో ఈత కొడుతూ.. గల్లంతయ్యారు. వారిలో ఒకరు బయటకురాగా మరో యువకుడు మహమ్మద్ ఫైజ్ ఆచూకీ లభించలేదు. చివరకు మత్స్యకారులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విలపించారు.
News October 25, 2025
డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి: కలెక్టర్

జిల్లాలో డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డ్రగ్స్, గంజాయి నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్, గంజాయిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
News October 24, 2025
రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్‌తో కలిసి నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గుత్తి -గుంతకల్లు రోడ్‌లోని రోడ్ & ఆర్ఓబీని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు.


