News January 5, 2026
పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి 85 ఫిర్యాదులు

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎక్కువగా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన ప్రజల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని పోలీస్ అధికారులు సంబంధిత ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News January 7, 2026
గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 18న విశాఖపట్టణం నుంచి చర్లపల్లి వరకు ప్రత్యేక రైలు(08513) రాత్రి బయలుదేరి గుంటూరు మీదుగా గమ్యానికి చేరుతుంది. అలాగే 19న చర్లపల్లి నుంచి విశాఖపట్టణానికి మరో ప్రత్యేక రైలు(08514) నడుస్తుంది. పండగ రద్దీని తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
News January 7, 2026
మారేడుమిల్లి: పొట్టకూటి కోసం వచ్చి.. యాక్సిడెంట్‌లో మృతి

ఊరూరా తిరుగుతూ రగ్గులు అమ్ముకునే దర్బార్ సింగ్ మంగళవారం మారేడుమిల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అతడు బైక్‌పై ప్రయాణిస్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రంపచోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడన్నారు.
News January 7, 2026
కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత, లిట్టర్ నిర్వహణ కీలకం

శీతాకాలంలో రాత్రి ఎక్కువ, పగలు తక్కువ సమయం ఉండటం వల్ల కోళ్ల ఫామ్‌లో ఉష్ణోగ్రత విషయంలో, నేల మీద పరిచే వరిపొట్టు(లిట్టర్) విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టులో తేమ పెరగకుండా 7 నుంచి 11 కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫేట్ 100 చదరపు అడుగుల లిట్టర్‌కు చేర్చాలి. వారానికి 2-3 సార్లు లిట్టర్‌ను కలియబెట్టాలి. ఇలా చేయడం వలన లిట్టర్‌లో తేమ తగ్గి కోడిపిల్లలు కోకిడియోసిస్‌కు గురి కాకుండా కాపాడుకోవచ్చు.


