News August 17, 2024

పుట్టపర్తి – ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభం

image

పుట్టపర్తి-ధర్మవరం మధ్య రాకపోకలు ప్రారంభమైనట్లు పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ తెలిపారు. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు మండల పరిధిలోని కేశవరం వద్ద వంకపేరు వరద నీటి ప్రవాహానికి రాకపోకలు స్తంభించాయి. మరమ్మతుల అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశాల మేరకు రాకపోకలు ప్రారంభించినట్లు ఆర్డీవో పేర్కొన్నారు. కొన్నిచోట్ల వాగుల్లో వరద ఉద్ధృతి తగ్గడంతో రాకపోకలు ప్రారంభమైయ్యాయి.

Similar News

News November 5, 2025

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, విస్తరించాలని కలెక్టర్ ఆనంద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ స్థాయి వరకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని అన్నారు.

News November 4, 2025

పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

image

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

పెడపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద సోమవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ రంగాను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారిని ఢీ కొన్న కారు ధర్మవరం వైపు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.