News October 6, 2025
పుట్టపర్తి: ప్రిన్సిపల్ మున్నీని పలకరించిన విజయ్ దేవరకొండ

పుట్టపర్తికి విచ్చేసిన సినీనటుడు విజయ దేవరకొండ ఆదివారం సత్య సాయి ప్రైమరీ స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ మున్నీని కలిశారు. ఆమెను ఆత్మీయంగా పలకరించి తాను చదువుకున్న నాటి తీపి గుర్తులను నెమరువేసుకున్నారు. అయితే తన నిశ్చితార్థ విషయం తెలిపేందుకు వెళ్లుంటారని అభిమానులు భావిస్తున్నారు.
Similar News
News April 9, 2026
అమరావతిలో కేంద్ర కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌కు రంగం సిద్ధం

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కీలక ప్రాజెక్ట్ అమలుకు ముందడుగు పడింది. రూ.2,534 కోట్ల వ్యయంతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రజా నిర్మాణ విభాగం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపింది. ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ భవనం పూర్తయితే పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట పనిచేసే అవకాశం ఏర్పడి రాజధాని పరిపాలనా ప్రాధాన్యం మరింత పెరగనుంది.
News April 9, 2026
వికారాబాద్: ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ఎక్స్‌ప్రెస్ టికెట్!

తాండూర్ డిపో నుంచి వికారాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ఎక్స్‌ప్రెస్ టికెట్ ఇస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలకు మించి డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీనరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో తిప్పడం సామాన్యుల జేబులు గుల్లచేయడానికే అని మండిపడుతున్నారు. దీంతో సామాన్యులపై అధిక భారం మోపడం సరికాదని వాపోతున్నారు. ఇలా మీకు జరిగిందా?
News April 9, 2026
ఇది విన్నారా.. పాక్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలట!

పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా డిమాండ్ చేస్తోంది. ‘అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో పాక్ కీలక పాత్ర పోషించింది. చర్చలకు అవసరమైన పరిస్థితులను సృష్టించింది. ఇరుపక్షాలకు నమ్మకమైన సమాచార దూతగా వ్యవహరించింది’ అని ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతా బానే ఉంది కానీ.. ఈ శాంతి బహుమతి కోసం విశ్రాంతి లేకుండా ప్రయత్నించిన ట్రంప్ ఊరుకుంటారా?


