News November 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 25, 2026

టెన్షన్ వద్దు.. మీ గెలుపు మీ చేతుల్లోనే!

image

TG: ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి MAR 18 వరకు బిగ్ డేస్. ఇవాళ్టి నుంచే వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. టెన్షన్ పడితే తెలిసినవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే కూల్‌గా ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లండి. ప్రశ్నపత్రం చూడగానే కంగారు పడకుండా మీకు బాగా వచ్చిన ప్రశ్నలతోనే మీ స్కోరింగ్ వేటను ప్రారంభించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి నిమిషాన్ని తెలివిగా వాడుకోండి. ALL THE BEST

News February 25, 2026

ఆనందంగా జీవించాలంటే ఇవి చాలు

image

జీవితంలో అశాంతికి కారణం పోలికే అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే మీకేం కావాలో ముందు తెలుసుకోవాలి. అసలైన సంపద ఆరోగ్యం, అవసరాలు తీర్చేంత బ్యాంక్ బ్యాలెన్స్, అర్థం చేసుకొనే భాగస్వామి, గాలి కబుర్లు, చెప్పుడు మాటలు చెప్పేవారిని దూరం పెట్టండి, రోజూ ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.

News February 25, 2026

27, 28 తేదీల్లో దానం, కడియంల విచారణ

image

TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. వారు BRS గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నిరూపించుకోవడానికి అవసరమైన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి ఇప్పటికే స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.