News November 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 23, 2026

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వానలు పడేందుకు ఆస్కారముందని తెలిపారు. హైదరాబాద్‌లో సాయంత్రం వేళ జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

News February 23, 2026

తిరుమల లడ్డూ అంశంపై రేపు అసెంబ్లీలో చర్చ

image

AP: అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై చర్చ జరగనుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై రేపు ఉ.10.30 నుంచి మ.2 గంటల వరకు చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడనున్నారు. మ.12.30 గంటల నుంచి సీఎం చంద్రబాబు ప్రసంగం ఉండనుంది. రేపు ఆయన కీలక ప్రకటన చేస్తారని సమాచారం. స్వల్ప అస్వస్థత కారణంగా Dy.CM పవన్ ఇవాళ సభకు రాలేదు. రేపటి చర్చలో ఆయన పాల్గొనే అవకాశముంది.

News February 23, 2026

ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు

image

ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఖలిస్థానీ గ్రూప్ పేరుతో ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రకోట, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని సమాచారం. ఉదయం ఢిల్లీలోని పలు స్కూల్స్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎర్రకోట సమీపంలో <<19199047>>ఉగ్ర దాడులు<<>> జరగొచ్చని ఇంటెలిజెన్స్ హెచ్చరించడం తెలిసిందే.