News April 5, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News April 22, 2025
హద్దుమీరాను.. బ్రాహ్మణులంతా క్షమించాలి: అనురాగ్ కశ్యప్

ఆవేశంలో హద్దు దాటి ప్రవర్తించానని, బ్రాహ్మణులందరూ తనను క్షమించాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కోరారు. ఫూలే సినిమాకు సంబంధించి ఓ నెటిజన్‌తో వాగ్వాదంలో ‘బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను. నీకేమైనా సమస్యా?’ అని ప్రశ్నించారు. ఆగ్రహంలో అలా నోరు జారానని తాజాగా వివరణ ఇచ్చారు. ‘నా జీవితంలో ఉన్న ఎంతోమంది బ్రాహ్మణులు నా వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నారు. బ్రాహ్మణులందర్నీ అనడం నా ఉద్దేశం కాదు’ అని పేర్కొన్నారు.
News April 22, 2025
సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు తేజాలు

* సాయి శివాని- 11వ ర్యాంక్, * బన్నె వెంకటేశ్-15
* అభిషేక్ శర్మ-38, * జయసింహారెడ్డి- 46
* శ్రవణ్ కుమార్ రెడ్డి-62, * సాయి చైతన్య- 68
* చేతన రెడ్డి-110, * శివగణేశ్ రెడ్డి-119,
* కృష్ణ సాయి-190, * పవన్ కుమార్-375,
* సూర్య తేజ-647, సాయిభార్గవ-798,
* సూర్య తేజ-799, సాయి మోహిని మానస-975
News April 22, 2025
లాక్‌డౌన్ టైమ్‌లో ‘పెద్ది’ కథ రాశా: బుచ్చిబాబు

రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కథలో కొంత ఊహాజనితం కాగా కొంత మాత్రం నిజజీవిత గాథల నుంచి తీసుకున్నానని ఆ మూవీ దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ‘నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలతో ప్రజలు త్వరగా కనెక్ట్ అవుతారనేది నా అభిప్రాయం. లాక్‌డౌన్ సమయంలో ఈ కథ రాశాను. సుకుమార్‌కు వినిపిస్తే బాగుందని, రామ్ చరణ్‌కు చెప్పమని అన్నారు. ఫస్ట్ సిటింగ్‌లోనే చరణ్ ఓకే చెప్పారు. చిన్న మార్పులు మాత్రం సూచించారు’ అని పేర్కొన్నారు.