News December 14, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 19, 2025
పూర్వోదయ, సాస్కీ పథకాలతో చేయూత ఇవ్వండి: సీఎం

AP: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని విన్నవించారు.
News December 19, 2025
భార్యను చంపి 72 ముక్కలు.. హైకోర్టు తీర్పు ఇదే

డెహ్రాడూన్‌లో భార్యను చంపి 72 ముక్కలుగా నరికేసిన సంచలన కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు దోషి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. నిందితుడు రాజేశ్ గులాటికి జీవిత ఖైదు, రూ.15 లక్షల ఫైన్ విధిస్తూ డెహ్రాడూన్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా రాజేశ్-అనుపమలకు 1999లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో 2010 OCT 17న భార్యను చంపి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచేయగా అదే ఏడాది DEC 12న విషయం బయటికొచ్చింది.
News December 19, 2025
అలాంటి ఒప్పందమే లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్దరామయ్య

పవర్ షేరింగ్‌పై ఎలాంటి రహస్య ఒప్పందం జరగలేదని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ఐదేళ్లు తానే CMగా కొనసాగుతానని అసెంబ్లీలో చెప్పారు. ‘నేను ఇప్పుడు సీఎంను. హైకమాండ్ డిసైడ్ చేసే వరకు కొనసాగుతా. అధిష్ఠానం నాకే ఫేవర్‌గా ఉంది. 2.5 ఏళ్ల ఒప్పందమేదీ జరగలేదు’ అని తెలిపారు. CM పదవిపై DK శివకుమార్, సిద్దరామయ్య మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ <<18446337>>బ్రేక్‌ఫాస్ట్<<>> మీటింగ్స్ నిర్వహించారు.


