News December 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 21, 2025
హనుమంతుడి కన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు?: జైశంకర్

శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘సీత సమాచారం కోసం హనుమ శ్రీలంకకు వెళ్లాడు. సమాచారం తెలుసుకుని, సీతమ్మను కలిసి మనోధైర్యం నింపాడు. రావణుడిని మానసికంగా ఓడించగలిగాడు. ఇంతకన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు? ఒక పని చెబితే 10 పనులు పూర్తిచేశాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే మన సంస్కృతికి అన్యాయం చేసినట్లే’ అని పుణే బుక్ ఫెస్టివల్‌లో అన్నారు.
News December 21, 2025
INDvsPAK.. భారత్ ఫస్ట్ బౌలింగ్

పాకిస్థాన్‌తో జరుగుతోన్న అండర్-19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్
☛ సోనీ స్పోర్ట్స్, సోనీలివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.
News December 21, 2025
‘రాజాసాబ్’ సినిమా బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ

‘రాజాసాబ్’కు ఆశించిన దానికంటే తక్కువ ధరకు OTT డీల్ జరిగిందని నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనిపై ఆయన Xలో స్పందించారు. ‘మేము ప్రొడక్షన్ ఖర్చులను బయటపెట్టం. మాకు, ఫ్యాన్స్‌కు థియేటర్ ఇంపాక్టే ముఖ్యం. రిలీజ్ తర్వాత స్క్రీన్లే మాట్లాడతాయి. కలెక్షన్లను అధికారికంగా ప్రకటిస్తాం. ఈ మూవీకి వచ్చిన నాన్-థియేట్రికల్ వాల్యూయే ప్రస్తుత మార్కెట్‌లో హైయెస్ట్’ అని పేర్కొన్నారు.


