News December 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 21, 2025
పాకిస్థాన్ భారీ స్కోరు

అండర్-19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 347-8 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో ఏకంగా 172 రన్స్ బాదారు. ఇందులో 9 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. అహ్మద్ హుస్సేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) రాణించారు. భారత బౌలర్లలో దేవేంద్రన్ 3, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఒక వికెట్ తీశారు.
News December 21, 2025
అబార్షన్ తర్వాత ఈ జాగ్రత్తలు

అబార్షన్ జరిగిన తర్వాత డాక్టర్ సూచన మేరకు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. పాలు, బ్రెడ్, పళ్లు, ఆకు కూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, డ్రైఫ్రూట్స్‌తో మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. అధిక రక్తస్రావం, దుర్వాసన, కడుపునొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. అలాగే మూత్రంలో మంట, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు.
News December 21, 2025
ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు(M), మహిళలకు 45ఏళ్లు. అర్హతగల వారు ఈనెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: https://angrau.ac.in


