News December 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 25, 2025

శివాజీ వ్యాఖ్యల వివాదం.. అనసూయ వార్నింగ్

image

TG: శివాజీ వివాదాస్పద <<18666465>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో నటి అనసూయ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్-19 కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని అడ్వకేట్ లీలా శ్రీనివాస్ మాట్లాడిన <>వీడియోను<<>> ఆమె షేర్ చేశారు. బెదిరింపు, అసభ్యకర మాటలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావని, చట్ట ప్రకారం కేసులు పెట్టొచ్చని అడ్వకేట్ అందులో హెచ్చరించారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు.

News December 25, 2025

తిరుమలలో RSS చీఫ్..

image

తిరుపతిలోని సప్త గో ప్రదక్షిణశాలను RSS చీఫ్ మోహన్ భాగవత్ ఇవాళ సందర్శించారు. హిందూ సంప్రదాయంలో గోపూజకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భోజనం చేశారు. తిరుపతిలోని నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి 4 రోజులపాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యేందుకు ఆయన తిరుపతి చేరుకున్నారు.

News December 25, 2025

భవిష్యత్‌లో సిరులు కురిపించనున్న కాపర్!

image

రానున్న రోజుల్లో కాపర్ (రాగి) ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న టన్ను కాపర్ ధర $12వేలు దాటింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్ నిర్మాణాలకు ఇవి ఎంతో కీలకం కాబట్టి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. 2030 నాటికి కాపర్ డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేశారు. బంగారం, వెండిలాగే కాపర్‌పైనా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.