News April 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

Similar News

News July 6, 2025

ఇండియన్ మూవీస్.. 6 నెలల్లో రూ.5,360cr+ కలెక్షన్స్!

image

ఈ ఏడాది తొలి 6 నెలల్లో 856 భారతీయ సినిమాలు థియేటర్లలో రిలీజై ₹5,360కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత ఏడాది మొదటి 6 నెలలతో (₹5,260cr) పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ₹300crకు పైగా వసూళ్లతో టాప్‌లో ఉండగా ఓవరాల్‌గా ‘ఛావా’ ₹800crతో తొలి స్థానంలో ఉంది. ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దక్షిణాది సినిమాల హవా కాస్త తగ్గింది.

News July 6, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: విద్యార్థులు 3 రోజులకు మించి స్కూళ్లకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే MEO, CRPలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్లాలని సూచించింది. టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపింది. టీచర్లు సెలవు పెడితే వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అకడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది.

News July 6, 2025

స్టాంప్ సవరణ బిల్లుతో ఉపయోగాలివే..

image

తెలంగాణ స్టాంప్ సవరణ బిల్లు-2025 తేవాలని <<16956370>>ప్రభుత్వం<<>> నిర్ణయించడంపై దీని ఉపయోగాలు ఏంటనే చర్చ మొదలైంది. చట్ట సవరణతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సేవల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం, రియల్ ఎస్టేట్, వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. నకిలీ స్టాంప్ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్‌లకు అడ్డుకట్ట వేయొచ్చు.