News January 19, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News February 16, 2026
బీజేపీ నేతకు హీరోయిన్ త్రిష వార్నింగ్

అనవసర వివాదాల్లోకి తనను లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హీరోయిన్ త్రిష హెచ్చరించారు. తమిళ హీరో విజయ్‌ని ఉద్దేశించి తనపై బీజేపీ నేత <<19138607>>నాగేంద్రన్<<>> చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ప్రతిష్ఠను దెబ్బతీశారన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 16, 2026
మరో పాన్‌ఇండియా మూవీలో సూపర్ స్టార్?

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్‌లు హోంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకే వీరి సమావేశం జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.
News February 16, 2026
అస్సాం, WB ఎన్నికలపై బంగ్లా పరిణామాల ప్రభావం

దేశ సరిహద్దులోని బంగ్లా ఎన్నికల ప్రభావం అస్సాం, WB అసెంబ్లీ ఎలక్షన్లపై ఏమేరకు ఉంటుందన్నది చర్చగా మారింది. మొత్తం జనాభాలో ముస్లింలు అస్సాంలో 40%, WBలో 30% ఉన్నారు. వీరిలో అక్రమ వలసదారులే అధికం. బంగ్లాలో ఏ పరిణామం చోటుచేసుకున్నా ఆ ప్రభావం ఈ రాష్ట్రాలపై పడుతోంది. బంగ్లా హిందువులపై దాడులను BJP 2 రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా చేసుకుంది. అయితే అక్కడ BNP అధికారంలోకి రావడంతో మార్పు ఉంటుందేమో చూడాలి.


