News July 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News July 4, 2025

11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు?: ఖర్గే

image

TG: కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని AICC చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. LB స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి సభలో మాట్లాడుతూ ‘రేవంత్, భట్టి కలిసి KCRను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. HYDలోని పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి. 11 ఏళ్లలో TGకి మోదీ ఏం ఇచ్చారు? రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల జాబ్స్ ఇచ్చారా’ అని వ్యాఖ్యానించారు.

News July 4, 2025

భారత్‌కు డ్రాగన్ బిగ్ వార్నింగ్

image

టిబెట్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను చైనా హెచ్చరించింది. దలైలామా వారసుడి ఎంపిక నిర్ణయం టిబెట్ చూసుకుంటుందని, ఇందులో ఇండియా తలదూర్చకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.

News July 4, 2025

ఖాళీ అవుతోన్న ‘తువాలు’

image

పసిఫిక్ మహాసముద్రంలోని కేవలం 5 మీటర్ల ఎత్తులో ఉండే ‘తువాలు’ దేశం ఖాళీ అవుతోంది. కొన్ని దీవుల సముదాయమైన ఈ దేశంలోని మెజారిటీ భూభాగం 2050 నాటికి సముద్రంలో కలిసిపోతుందని NASA హెచ్చరించడంతో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. ఈక్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒప్పందంతో ‘క్లైమెట్ వీసా’ కోసం దేశంలోని 10643 మందిలో మూడో వంతు ప్రజలు అప్లై చేసుకున్నారు. కానీ ఏడాదికి 280 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.