News August 5, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News July 6, 2025

బిహార్‌ను క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు: రాహుల్ గాంధీ

image

BJP, CM నితీశ్ కలిసి బిహార్‌ను భారతదేశ క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పట్నాలో <<16949011>>గోపాల్ ఖేమ్కా హత్య<<>> ద్వారా ఇది మరోసారి రుజువైందన్నారు. ‘బిహార్‌లో నేరాలు సాధారణంగా మారినా అసమర్థ ప్రభుత్వం ఏం చేయట్లేదు. భద్రత ఇవ్వలేని వారికి మీ భవిష్యత్తును అప్పగించొద్దు. ఈసారి ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు.. బిహార్‌ను కాపాడేందుకు ఓటు వేయండి’ అని ట్వీట్ చేశారు.

News July 6, 2025

సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

image

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

News July 6, 2025

CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల

image

CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాలను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) విడుదల చేసింది. <>https://icai.nic.in/caresult/<<>> వెబ్‌సైట్‌లో స్కోర్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలు మేలో జరిగాయి. ఇందులో పాస్ కాని వారు సెప్టెంబర్‌లో జరిగే ఎగ్జామ్స్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 18తో ముగియనుంది.